ఉత్తరప్రదేశ్(UP)లోని ఝాన్సీ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీలోని NICUలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు(Newborn babies) సజీవదహనం అయ్యారు. అయితే ఆ ప్రమాదం సమయంలో మొత్తం 54 మంది పసిపిల్లలున్నట్లు సమాచారం. కాగా అందులో 16 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. మరో 28 మందిని సురక్షితంగా ఫైర్ సిబ్బంది(Fire crew) రక్షించారు. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో శుక్రవారం రాత్రి 10.45 గంటలకు ఈ ఘటన జరిగింది.
ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం
ఒక్కసారిగా మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. ఇంక్యుబేటర్ల(In incubators)లో శిశువులు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి(fire accident) షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాద ఘటనపై విచారణ జరిపి 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఝాన్సీ కమిషనర్, DIGని CM యోగి ఆదేశించారు.
పీఎం మోదీ, సీఎం యోగి విచారం
UPలోని ఝాన్సీలో జరిగి ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని.. ఎలా జరిగిందో విచారణ చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. CM ఆదేశాలతో DyCM బ్రిజేశ్ పాఠక్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కూడా వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు. అటు UP ఘటనపై ప్రధాని మోదీ(PM Modi) సైతం స్పందించారు. చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం యోగీ ప్రభుత్వానికి సూచించారు.
10 infants charred to death in NICU of Jhansi medical College.https://t.co/ETYtRqR3mj pic.twitter.com/7GjVH9Y4pn
— Arvind Chauhan, very allergic to 'ya ya'. (@Arv_Ind_Chauhan) November 15, 2024






