TGPSC: నేడే గ్రూప్-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!

లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న TGPSC Group-1, 2, 3 ఫలితాల విడుదలకు తేదీలు ఖరాయ్యాయి. తాజాగా జరిగిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అనేక నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించడంతో పాటు ఇప్పటికే నిర్వహించిన పలు పరీక్షల జనరల్‌ ర్యాంకింగ్‌ /రిజల్ట్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టుల ఫలితాల తేదీలూ ఫిక్స్

గ్రూప్‌-1 ఉద్యోగ నియామక పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రొవిజినల్‌ మార్కుల వివరాలను ఇవాళ (మార్చి 10) ప్రకటించనున్నారు. అలాగే, గ్రూప్‌-2 అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా మార్చి 11న, గ్రూప్‌- 3 పరీక్ష జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను మార్చి 14న విడుదల చేస్తారు. వీటితో పాటుగా హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 ఉద్యోగాలు, 783 గ్రూప్‌-2, 1,365 గ్రూప్‌-3 పోస్టులతో పాటు 581 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు గతంలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

TGPSC: తెలంగాణ గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల |  tgpsc-group-1-mains-exam-schedule-here

తప్పుడు సమాచారంపై జాగ్రత్త

గ్రూప్‌-1 ఉద్యోగ నియామకాలపై ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని TGPSC ఇటీవల విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, సమాచారాన్ని పొందడంలో సహాయం చేస్తామని సంప్రదిస్తే పోలీసు కంప్లయింట్‌తో కలిపి కమిషన్‌కు ఫిర్యాదు చేసేలా మొబైల్‌ నంబర్‌ (99667-00339), ఈ మెయిల్‌ ఐడీ (vigilance@tspsc.gov.in) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.

Related Posts

Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…

Infosys: యువతకు గుడ్‌న్యూస్.. ఈ కోర్స్ లు చేస్తే జాబ్స్ పక్కా.. అంటున్న ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్‌లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *