నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మరో మాస్ టైటిల్ మూవీతో ఈనెల 12న వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో(Directed by Bobby) బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్(Poster), ప్రమోషనల్ వీడియో(Poster, Promotional Video)లు, ట్రైలర్(Trailer) అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా హైదరాబాద్‌లోని ITC కన్వెన్షన్ హాల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) మాట్లాడుతూ.. ‘‘డాకు సినిమా కోసం వీరు క్రియేట్ చేసుకున్న వరల్డ్ చాలా గొప్పది. వరల్డ్ అంటే ఇష్యూ చాలా చాలా గొప్పది. వీరంతా పడిన కష్టం కూడా చాలా ఎక్కువ. అఖండ సమయంలో బాలయ్య బాబు కష్టం నేను చూశాను’’ అని తమన్ చెప్పారు.
బాలయ్య గారి గురించి నేనేం చెప్పాలి?
అంతేకాదు.. అనంతపురం(Ananthapuram)లో మాట్లాడాలని మేము పెద్ద పెద్ద స్పీచ్‌లు ప్రిపేర్ చేసుకున్నాం. స్పీచ్(Speech) అంటే స్పీచ్ అని కాదు ఈ సినిమా కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది. ఇక బాలయ్య గారి గురించి నేనేం చెప్పాలి? మా అమ్మ కాల్ చేసి రెండు మూడు మంత్రాలు చదివి ఈరోజు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతుంది. ఆ తర్వాత ఆమె లాగా బాలకృష్ణ కాల్ చేస్తారు. రెండు మంత్రాలు చదివి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. నాకు నాన్న(Father) లేరు ఆ లోటు బాలకృష్ణ(Balakrishna) గారి వల్ల తీరిపోయింది. బాలయ్య గారు అంటే 100% ఇస్తాను స్పీకర్లు, కాలిపోతే కాలిపోనివ్వండి మాకు సంబంధం లేదు. కాలతాయి అంతే. దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. బాలయ్య గారి సినిమా అంటే మీరందరూ రెడీ అవ్వండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎలా అంటారో నాది బాలయ్యది సినిమా వస్తుందంటే స్పీకర్లు కాలిపోతాయి. అందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ తమన్ చెప్పుకొచ్చారు. ఇంకా తమన్ ఏమన్నారు ఈ వీడియోలో చూసేయండి..







