ఉత్తరప్రదేశ్(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు(Container truck) బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా 8 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాస్గంజ్ జిల్లాకు చెందిన సుమారు 61 మంది యాత్రికులు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ ట్రాలీలో బయలుదేరారు. జాతీయ రహదారి-34పై ఘటల్ గ్రామం సమీపంలో ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా కొట్టింది.
మరో ముగ్గురి పరిస్థితి విషమం
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీతో సహా పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను రహదారి నుంచి తొలగించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Bulandshahr, #UttarPradesh | 8 people dead and 43 injured after a container hit a tractor full of devotees of Gogaji, going to Gogamedi, #Rajasthan, from #Kasganj, near Ghatal village on National Highway 34 under Bulandshahr police station: #Bulandshahr SSP Dinesh Kumar Singh. pic.twitter.com/J9D0aAYlZi
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 25, 2025






