సినీ ఇండస్ట్రీ(Film industry)లోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు నటి నయనతార(Nayanthara). తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ(
Popularity)ని సొంతం చేసుకుందీ బ్యూటీ. అనతికాలంలోనే లేడీ సూపర్‌స్టార్(Lady Superstar)గా గుర్తింపు పొందారు. 2003లో మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై సౌత్ ఇండియా(South India)లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇక సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్(Director Vignesh)ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ రోజు నయనతార బర్త్ డే(Nayanthara’s birthday). ఈ సందర్భంగా ఈ అందాల తార కొత్త సినిమాపై మేకర్స్ అప్డేడ్ ఇచ్చారు. నయన్ కొత్త మూవీకి ‘రక్కయీ(Rakkayie)’గా టైటిల్ ఖరారు చేస్తూ.. నయన్ లుక్‌ని టీజర్(Teaser) రూపంలో రివీల్ చేశారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ
నేడు నయనతార పుట్టిన రోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు Wishes తెలుపుతున్నారు. తాజాగా నయనతార మెయిన్ లీడ్‌గా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ కొత్త సినిమా టీజర్లను విడుదల చేశారు. ఈ టీజర్లో.. నయన్ ఏడుస్తున్న చిన్న బాబుని పడుకోబెట్టి ఆ తర్వాత తన మీదకు దాడికొచ్చిన వాళ్లపై సింగిల్‌గా పోరాటం చేసింది. కర్ర, కత్తి పట్టుకొని చీరలో మాస్ పర్ఫార్మెన్స్(Mass Performance) చేసింది. యాక్షన్ అదరగొట్టేసింది. టీజర్ చూస్తుంటే ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్(
Village back drop)లో యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా నయన్ కొత్త సినిమా రక్కయి టీజర్ చూసేయండి.
ఓటీటీలోకి నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్
ఇదిలా ఉండగా సాధారణ నటిగా కెరీర్ మొదలు పెట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన నయనతార జీవితంపై ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix) ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో నయన్ కెరీర్ ఎలా మొదలైంది? నుంచి వివాహం వరకు అన్నింటినీ చూపించారు. ఈరోజు (నవంబర్ 18) నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (Nayanthara: Beyond the Fairy Tale)’ అనే టైటిల్‌తో ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.






