Kannappa: యూఎస్‌లో ‘కన్నప్ప’ ప్రీమియర్స్.. బుకింగ్స్ ఓపెన్

మంచు విష్ణు(Manchi Vishnu), ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ముకేశ్ రుషీ, శరత్ కుమార్, మధుబాల, నయనతార వంటి నటీనటులతో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ‘కన్నప్ప(Kannappa)’ చిత్రం అమెరికా(US)లోని తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యూఎస్‌ ప్రీమియర్ల(US premieres)కు సంబంధించిన కీలక వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అమెరికాలో ‘కన్నప్ప’ సినిమా గ్రాండ్ ప్రీమియర్ షోలు జూన్ 26వ తేదీన ప్రదర్శితం కానున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు (EST) ఈ ప్రీమియర్లు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.

వీరగాథను వీక్షించండి అనే క్యాప్ష‌న్‌తో..

కాగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని అమెరికాలో వాసారా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ(Vasara Entertainment Company) విడుదల చేస్తోంది. “ది లెజెండ్ రైజెస్. ది ఫెయిత్ ఇగ్నైట్స్. విట్‌నెస్ ది ఎపిక్ సాగా ఆఫ్ డివోషన్ అండ్ కరేజ్ వీరుడు ఉదయిస్తున్నాడు. విశ్వాసం ప్రజ్వరిల్లుతోంది. భక్తి, ధైర్యంతో కూడిన ఈ వీరగాథను వీక్షించండి” అనే క్యాప్ష‌న్‌తో గ్రాండ్ ప్రీమియర్ షో(The premiere show)ల వివ‌రాల‌ను మేక‌ర్స్ పంచుకున్నారు.

‘కన్నప్ప’ టైటిల్ పాత్ర చుట్టూ..

సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రీమియర్ షోల కోసం టికెట్ బుకింగ్స్(Ticket bookings) కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు తమ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ‘కన్నప్ప’ టైటిల్ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ, పురాణాల్లోని భక్తితత్పరతను, అసామాన్య ధైర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది. తెలుగు సినీ చరిత్రలో ఇదొక గొప్ప దృశ్యకావ్యంగా నిలిచిపోతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *