
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఉన్న సిగాచీ రసాయనిక పరిశ్రమ(Sigachi Chemical Industry)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు(Police Case) నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్(Yashwant) ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యం సిగాచీపై BDL భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో అధికారిక లెక్కల ప్రకారం 36 మంది మృతి చెందగా, మరికొంతమంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటి వరకూ 11 మంది మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.11 లక్షలు, 34 మంది క్షతగాత్రులకు రూ.17 లక్షల నగదును ప్రభుత్వం అందించింది.
DNA పరీక్షలు నిర్వహించే గుర్తించారు..
కాగా సిగాచీ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో జరిగిన పేలుడులో 19 మంది కార్మికులు మృతి చెందారని, ఐదుగురి ఆచూకీ తెలియడంలేదని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. కానీ, సహాయక సిబ్బంది మంగళవారం మరో 17 మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 36కు చేరింది. గాయపడిన 34 మంది నగర శివార్లలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 60 మంది కార్మికుల ఆచూకీ లభించిందని, మరో 13 మంది ఆచూకీ తెలియడంలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143 మంది పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. భవనం శిథిలాలను పూర్తిగా తొలగిస్తేనే గల్లంతైన వారి వివరాలు లభిస్తాయి. మరోవైపు చనిపోయిన వారిని గుర్తించడానికి వారి బంధువులకు DNA పరీక్షలు నిర్వహించి గుర్తించే ప్రక్రియ చేపట్టారు.
🔴 Tragic: Massive explosion at Sigachi Pharma unit near Hyderabad claims 36 lives, leaves 30+ injured.
Many were crushed under the debris as the reactor unit collapsed.
Rescue ops continue. CM Revanth Reddy visits site; official probe underway.#SigachiExplosion #Hyderabad… pic.twitter.com/kpMy0WgNlJ— CTRLthenarrative (@CTRLthnarrative) July 1, 2025
ఉన్నతస్థాయి కమిటీ వేయాలి: బీజేపీ
బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramachandra Rao)తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పాశమైలారం పారిశ్రామికవాడ ప్రమాద స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు పలు మృతదేహాలను వెలికితీశారని, మరో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందని వివరించారు. పొట్టకూటి కోసం వలస వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు.