భారతీయ సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన వెబ్ సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man)’ ఒకటి. కరోనా సమయంలో ఈ సిరీస్ సీజన్-1 వచ్చి ఇండియన్ ఆడియెన్స్ మనసు దోచేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అదిరిపోయే కథతో అలరించింది. ఆ తర్వాత వచ్చిన సీజన్-2 కూడా ఆకట్టుకుంది. ఈ సిరీస్ కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ ఇప్పుడు పార్ట్-3 ప్లాన్ చేశారు. ఇప్పటికే షూటింగు పూర్తి చేసుకున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 నుంచి తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.
సీజన్-3 స్ట్రీమింగ్ డేట్
రాజ్ అండ్ డీకే (Raj & DK) దర్శకద్వయం తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రీకాంత్ అనే ప్రధాన పాత్రలో నటించిన మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee) తాజాగా సీజన్-3 గురించి అప్డేట్స్ షేర్ చేసుకున్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్ తో మాట్లాడిన ఆయన మొదటి రెండు సీజన్ల కంటే మూడో సీజన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇందులో మరో బాలీవుడ్ యాక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని వెల్లడించారు.
సీజన్-3లో మరో టాలెంటెడ్ నటుడు
అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే వచ్చిన ‘పాతాళ్‌లోక్’ అనే సిరీస్ లో నటుడు జయదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat) తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’లో కనిపిస్తారని మనోజ్ బాజ్ పాయ్ తెలిపారు. రెండేళ్ల క్రితమే ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారని వెల్లడించారు. ఆయన క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. స్టోరీని కీలక మలుపు తిప్పుతుందని చెబుతూ సీజన్-3పై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇక పార్ట్ 3లో జైదీప్ అహ్లావత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం.






