స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించిన వెబ్‌సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ డ్రామా థ్రిల్లర్ మూడో సిరీస్ కూడా త్వరలోనే అలరించనుంది. మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) కీలక పాత్ర పోషించిన ‘ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3’(The Family Man 3) విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం ఈ సిరీస్లో షరీబ్ హష్మి, ప్రియమణి (Priyamani), సందీప్ కిషన్ (Sundeep Kishan), ఆశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్ తదితరులు నటించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీమ్ సర్‌ప్రైజ్ ఇస్తూ.. టీజర్‌ను విడుదల చేసింది. గత రెండు సీజన్లలో జరిగిన కొన్ని సన్నివేశాలను గుర్తుచేస్తూ.. రాబోయే సీజన్ను పరిచయం చేస్తూ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఈజ్ బ్యాక్.. న్యూ సీజన్ కోసం వేచి ఉండండి అంటూ వీడియోను ముగించింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.






