ప్రతి రోజు రాత్రి ఈ సినిమాలే చూస్తాను.. అప్పుడే నిద్రపడదంటున్న నిధి అగర్వాల్ ట్వీట్ వైరల్!

టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌లలో నిధి అగర్వాల్‌(Nidhi Agarwal) ఒకరు. సినిమాల పరంగా పెద్దగా విజయాలు అందుకోలేకపోయినప్పటికీ, స్టార్ హీరోలతో సినిమాల్లో అవకాశాలు అందుకొంటోంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయాయి. కానీ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.

ఆ తరవాత తమిళ సినిమాల్లో నటించినా ఆమెకు గట్టి బ్రేక్ రాలేదు. కానీ ఇప్పడు ఆమెకు పాన్ ఇండియా ప్రాజెక్టులలో అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) సరసన ‘రాజాసాబ్’(Raja Raja Saab), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)జోడిగా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి కెరీర్ టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమాలు నిలుస్తాయో లేదో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

ఇక సినిమాలతో పాటు నిధి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటోలు, వీడియోలు, పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ కు టచ్ లో ఉంటోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఫాలోవర్లతో చిట్‌చాట్ నిర్వహించిన నిధి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రతి రోజు రాత్రి మర్డర్ మిస్టరీలు చూస్తానని, ప్రస్తుతం కొత్త కంటెంట్ దొరకడం లేదని పేర్కొంటూ, అభిమానుల్ని సజెషన్లు ఇవ్వమని కోరింది. “ఏ భాష అయినా సరే.. మంచి మర్డర్ మిస్టరీలు చెప్పండి” అంటూ ట్వీట్ చేయడంతో ఆమె కామెంట్ వైరల్ అయింది.

దీనిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన మేఘాల హానీమూన్ కేసు, తేజేశ్వర్ మర్డర్ కేసు వంటి రియల్ లైఫ్ మిస్టరీలపై రీసర్చ్ చేయమని సూచిస్తున్నారు. అలాగే ఇటీవల తెలుగు లో వచ్చిన కొన్ని క్రైమ్ థ్రిల్లర్లను కూడా చూడమని సలహాలు ఇస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *