
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత్(England Vs India 4th Test) సిద్ధమైంది. ఇవాళ్టి (జులై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. లార్డ్స్(Lord’s)లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్‌ను సమం చేయడానికి భారత జట్టుకు ఈ మ్యాచ్ కీలకం. ఇదిలా ఉండగా టీమిండియా గాయాల సమస్యలతో సతమతమవుతోంది. నితీశ్ కుమార్ రెడ్డి (మోకాలి గాయం), అర్ష్‌దీప్ సింగ్ (బొటనవేలు గాయం), ఆకాష్ దీప్ (గజ్జల్లో గాయం) ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది.
కంబోజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం
ధ్రువ్ జురెల్(Dhruv Jurel) వికెట్ కీపర్‌గా, అన్షుల్ కంబోజ్(Anshul Kamboj), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లు జట్టులో చేరే అవకాశం ఉంది. రిషబ్ పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), మహ్మద్ సిరాజ్(Siraj)లతో కలిసి కంబోజ్ పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఇంగ్లండ్ జట్టు కూడా గాయాలతో బాధపడుతోంది. ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్(Shoaib Bashir) చేతి గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో లియామ్ డాసన్(Liam Dawson)ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిలో ఆర్చర్, బెన్ స్టోక్స్ కీలకం కానున్నారు.
వారిపైనే బ్యాటింగ్ భారం?
మాంచెస్టర్ పిచ్ తొలుత బ్యాటింగ్(Batting)కు అనుకూలంగా ఉంటుందని, క్రమంగా స్పిన్నర్లకు కూడా కొంత సహకారం అందించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శుభమన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలో టీమిండియా బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, గిల్, పంత్, జడేజాలపైనే ఎక్కవగా ఆధారపడుతోంది. జైస్వాల్, కరుణ్ నాయర్‌ల నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే భారత బౌలర్లు ఇంగ్లండ్ టెయిలెండర్స్‌ను త్వరగా ఔట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మూడో టెస్టులో వారు 84 పరుగులు జోడించారు. కాగా ఈ మ్యాచుకు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.
BATTLE RESUMES AT OLD TRAFFORD! 🏏🔥
The stage is set for the 4th Test of the India Tour of England 2025
📍 Emirates Old Trafford, Manchester
🗓️ July 23 – July 27
🕞 03:30 PM IST | 06:00 AM ESTIt’s Joe Root vs Jasprit Bumrah as two giants lock horns in this crucial Test clash!… pic.twitter.com/qYnIvFlC67
— CrickBuster (@Crick_buster) July 23, 2025