భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)ల సంయుక్త మిషన్ ‘నిసార్(NISAR)’ ప్రయోగం నేడు (జులై 30) జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(SHAAR) నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. GSLV-F16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. నిసార్ అనేది డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్(Dual-frequency synthetic aperture radar) కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి భూమిని పరిశీలించే ఉపగ్రహం.
కాగా ఈ ఉపగ్రహం బరువు 2,392 కిలోలు ఉంటుంది. దీనిని సన్ సింక్రోనస్ ఆర్బిట్(Sun synchronous orbit)లో ఉంచనున్నారు. ఇది భారత్, అమెరికాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండగా భూమికి సంబంధించిన వివరణాత్మక చిత్రాలను పంపనుంది. శాటిలైట్ ప్రతి 12 రోజులకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలానికి సంబంధించిన ఫొటోలను తీయనుంది. దీని నుంచి పొందిన డేటాతో భూకంపాలు(Earthquakes), అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటం, వ్యవసాయం వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
అలాగే ఈ ఉపగ్రహం నుంచి వచ్చే అధిక రిజల్యూషన్ చిత్రాలు(High resolution images) హిమానీనదాలను పర్యవేక్షించడంలో భారత్(India), అమెరికా(America) ప్రభుత్వాలకు సహాయపడతాయి. చైనా, పాకిస్థాన్‌లతో భారతదేశ సరిహద్దులను నిశితంగా పరిశీలించడంలోనూ దోహదపడనున్నాయి. ఈ మిషన్ 5 సంవత్సరాలు పనిచేయనుంది. కాగా ఇప్పటికే ఈ మిషన్‌కు సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
GSLV-F16/NISAR
1 Day to Launch.
GSLV-F16 is ready to carry NISAR into orbit. Final prep underway.Launch countdown has commenced at 14:10 hours today.
🗓️ July 30, 2025
Live from: 17:10 Hours IST
Liftoff at : 17:40 Hours ISTLivestreaming Link: https://t.co/flWew2KJri
For… pic.twitter.com/12iTH7aRDn
— ISRO (@isro) July 29, 2025






