
బంగారం ధరలు తగ్గేదేలే అన్నట్లు రోజురోజుకూ పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. ఈనెల మొదటి నుంచి పెరుగుతున్న పుత్తడి ధరలు మరోసారి భారీగా హైక్ అయ్యాయి. దీంతో మంగళవారం (ఫిబ్రవరి 11) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు భగ్గుమన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.800 పెరిగి రూ.80,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.870 పెరగడంతో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి ధర రూ.87,930కు చేరింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దీంతో వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్(Demand) అధికంగా ఉండటంతోపాటు దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు(Stock Markets) రెండో రోజూ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ప్రస్తుతం నిఫ్టీ(Nifty) 23, 293 (-88), సెన్సెక్స్(Sensex) 77,025 (-285) వద్ద ట్రేడవుతున్నాయి. IT షేర్లు గ్రీన్‌లో ఉండగా.. ఫైనాన్స్, BANK, మీడియా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రూపీ(Rupee) వ్యాల్యూ కూడా మరింత క్షీణిస్తోంది. ప్రస్తుతం ఒక US డాలర్‌కు రూ.88.07గా రూపీ వ్యాల్యూ ఉంది.