
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ (ఫిబ్రవరి 11వ తేదీ) తెలంగాణలో ఆకస్మికంగా పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఆయన హనుమకొండలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చెన్నై పర్యటన నేపథ్యంలో హనుమకొండలో ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ ఉంటుందని వెల్లడించాయి. సుప్రభ హోటల్‌లో రెండు గంటల పాటు హనుమకొండలో రాహుల్ రెస్ట్ తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.
విద్యార్థులతో రాహుల్ ట్రైన్ జర్నీ
విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా రాహుల్ గాంధీ రైల్లో ప్రయాణించనున్నారు. దిల్లీ నుంచి చెన్నైకి తమిళనాడు విద్యార్థులు రైల్లో వెళ్లనున్నారు. వారితో కలిసి రాహుల్ గాంధీ కూడా చెన్నై వెళ్తారు. అయితే విద్యార్థులతో కలిసి ప్రయాణం చేసేందుకు ఆయన వరంగల్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కనున్నారు. అనంతరం రైల్లో విద్యార్థులతో కలిసి ముఖాముఖిలో పాల్గొననున్నారు.