
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)కి మరో 8 రోజులు మాత్రమే ఉంది. తుది జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి గడుపు నేటితో (ఫిబ్రవరి 11)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఫిట్నెస్ విషయంలో ఇంకా BCCI ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ టోర్నమెంట్ కోసం ఎంపికైన 8 జట్లు ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ICC టోర్నమెంట్ కోసం తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ట్రోఫీని గెలుచుకునే ఫేవరెట్‌లలో ఒకటైన భారత జట్టుకు బుమ్రా విషయంలో కాస్త ఆందోళన చెందుతోంది. మరోవైపు భారత జట్టుకు బుమ్రా లేకపోతే బౌలింగ్ కాస్త వీక్ అవుతుందని అభిమానులు, క్రికెట్ మాజీలు అంటున్నారు.
బీజీటీ సిరీస్‌లో గాయపడి
ఈ నెల 19 నుంచి పాకిస్థాన్(Pakistan), దుబాయ్(Dubai) వేదికలలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జట్టులో మార్పులకు ఐసీసీ ఇచ్చిన తుది గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో BCCI నేడు బుమ్రా విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన బుమ్రా.. సిరీస్ చివరి టెస్ట్ నుంచి గాయం కారణంగా దూరమయ్యాడు.
అదే జరిగితే రాణాకు ఛాన్స్
మరోవైపు ఫిబ్రవరి 12న అహ్మదాబాద్(Ahmadabad)లో ఇంగ్లండ్‌తో జరిగే 3వ వన్డేకు భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన తాత్కాలిక జట్టులో కూడా బుమ్రాకి చోటిచ్చారు. అయితే బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బుమ్రా తన వెన్నునొప్పికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఈ స్కానింగ్ రిపోర్టు ఆధారంగా ఈరోజు బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం తేలనుంది. ఒకవేళ బుమ్రా ఫిట్‌గా లేకుంటే అతని స్థానంలో హర్షిత్ రాణా(Harshit Rana)ను తీసుకునే అవకాశం ఉంది.
Jasprit Bumrah and Arshdeep Singh are best fast bowling options for Team India. #mohammedshami is not in a good physique and form. #HardikPandya and #HarshitRana are ok in middle overs. Coach #gautamgambhir should focus on bowling side. #JaspritBumrah #arshdeepsingh #BCCI pic.twitter.com/KdkdWnIiCV
— Shankar Singh (@Shanky_Parihar) February 11, 2025