
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ఫుల్ ఫామ్ లో ఉన్నా.. ఫామ్ కోల్పోయి సరైన పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా ఆయన పాపులారిటీ మాత్రం తగ్గదు. కోహ్లీ వస్తున్నాడంటే స్టేడియం అంతా ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోవాల్సిందే. విరాట్ బ్యాట్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడంటే.. ఆ ప్రాంతమంతా విరాట్, విరాట్, విరాట్ అనే నామస్మరణతో మార్మోగాల్సిందే. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ క్రికెటర్ కోసం ఎయిర్ పోర్టుల వద్ద కూడా అభిమానులు వేచి చూస్తుంటారు.
లేడీకి కోహ్లీ హగ్
కోహ్లీ బయట కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వటానికి అభిమానులు పోటీ పడుతుంటారు. అయితే, తాజాగా విరాట్ స్వయంగా ఓ మహిళ దగ్గరకు వెళ్లి హగ్ (Virat Kohli Hugs A Woman) ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఆ లక్కీ లేడీ ఎవరంటూ నెట్టింట ఇప్పుడు ఒకటే చర్చ. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే కోసం టీమిండియా (Team India) అహ్మదాబాద్ బయలు దేరేందుకు భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
Virat Kohli met a lady (close relative) at Bhubaneswar airport🥹❤️ pic.twitter.com/r71Du0Uccf
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) February 10, 2025
కోహ్లీ హగ్ ఇచ్చిన లేడీ ఎవరంటే?
ఎయిర్ పోర్టులో చెకింగ్ ఏరియా వద్ద ఫ్యాన్స్ క్రికెటర్లను చూసేందుకు నిలబడ్డారు. కోహ్లీ వస్తుండగా అభిమానుల గుంపులో ఓ మహిళను చూసి ఆమెను పలకరిస్తూ దగ్గరగా వెళ్లి ఓ హగ్ ఇచ్చాడు. క్షేమసమాచారాలు తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ లక్కీ లేడీ ఎవరంటూ నెట్టింట ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే, సదరు మహిళ కోహ్లీకి దగ్గరి బంధువు అని సమాచారం. అందుకే విరాట్ దగ్గరికి వెళ్లి హగ్ ఇచ్చినట్లు తెలిసింది.