
ఇంగ్లండ్(England)తో ఇప్పటికే T20 సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకున్న భారత్(Team India).. అదే ఊపులో ODI సిరీస్‌ను 2-0 దక్కించుకుంది. ఇక చివరిదైన మూడో వన్డే ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమ్ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. కాగా గత మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సూపర్ సెంచరీతో ఫామ్‌లోకి రావడంతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్ఠంగా మారింది. మరోవైపు ఇవాళ ఇండియా తుది జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది.
మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
మరోవైపు వరుస ఓటములతో ఇంగ్లండ్ జట్టు సతమతమవుతోంది. ఆ జట్టు బ్యాటర్లు రాణించినా బౌలింగ్‌లో విఫలమవుతుండటంతో బట్లర్ సేన ఆందోళనలో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి ఇదే చివరి మ్యాచు కావడంతో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవడంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీకి మానసికంగా సిద్ధమవ్వాలని భావిస్తోంది. ఇక టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ(Virat Kohli) ఈ మ్యాచ్‌లో మరో 89 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో 14000 పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా అవతరిస్తాడు. తొలి వన్డేకు దూరమైన కోహ్లీ.. రెండో వన్డేలో తక్కువ పరుగులు చేసి నిరాశపరిచాడు.
రెండు జట్ల అంచనా..
INDIA: రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్/రిషబ్ పంత్(WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, వరుణ్, మహమ్మద్ షమీ
ENGLAND: ఫిలిప్ సాల్ట్ (WK), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(C), లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ బాంటన్/జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్/బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్/జోఫ్రా ఆర్చర్
IND vs ENG Match Prediction – Who will win today’s 3rd ODI match between India and England?https://t.co/dKq9HYAZqS#Bj88 #Baji #BjSports #Sports #Cricket #INDvsENG #IndiaCricket #EnglandCricket #ODI #MatchPrediction pic.twitter.com/bPzmbdsQuj
— BJ Sports (@Bjsports_OFC) February 12, 2025