
నిరుద్యోగుల(Unemployees)కు ఏపీ సర్కార్(AP Govt) శుభవార్త చెప్పింది. 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(Mega DSC Notification) విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ(School Education Department) వెల్లడించింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా గతంలో టీచర్లకు 45 రకాల Appలు ఉండేవని, వాటన్నింటినీ కలిపి ఒకే యాప్‌గా మార్చేశామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్(Kona Shasidhar) తెలిపారు. అలాగే త్వరలో టీచర్ల బదిలీల చట్టం(Teachers Transfer Act) తేనున్నట్లు వెల్లడించారు.
న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు
ఇక మార్చిలో Mega DSC నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. కాగా, 16,247 ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు (SA)- 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT)- 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT)- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT)- 286, వ్యాయామ ఉపాధ్యాయులు (PET)- 132, ప్రిన్సిపాల్స్- 52 పోస్టులు ఉన్నాయి.