ఇండస్ట్రీలో భారీ పారితోషికం తీసుకునే టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రభాస్()Prabhas పేరే ముందుగా వినిపిస్తుంది. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి సత్తా చాటిన ఆయన హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’(The Raja Saab ) సినిమాతో మరోసారి తెరపైకి రానున్నారు. హాస్యభరిత చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు వసూలు చేస్తుండగా.. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు, ‘ది రాజా సాబ్’ కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంటే ఏకంగా రూ.50 కోట్ల వరకు ప్రభాస్ తగ్గారట. ఇందుకు కారణం గతంలో విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా అంటున్నారు.
ఆదిపురుష్ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడం, ప్రభాస్ లుక్, నటనపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ రావడం చూసున్నాం. దీనిపై ప్రభాస్ అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఆదిపురుష్ సినిమా రూపొందించింది. ఇప్పుడు అదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ‘ది రాజా సాబ్’ సినిమాను నిర్మిస్తోంది. దీంతో ఇప్పుడైనా నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభాస్ స్వచ్ఛందంగా తన పారితోషికాన్ని తగ్గించినట్టు ఫిలిం నగర్ టాక్.
రొమాంటిక్ హారర్ కామెడీగా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ‘ది రాజా సాబ్’ సినిమా తెరకెక్కుతోంది. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీ.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, దర్శకుడు మారుతికి ఇది భారీ స్కేల్ ప్రాజెక్ట్‌గా మారుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 5, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.






