సలార్(Salar), కల్కి(Kalki) వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్(The Raja Saab)’. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి(Director Maruthi) తెరకెక్కిస్తున్నాడు. మాళవికా మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్(Thaman) సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై TG విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో ‘ది రాజాసాబ్’ నిర్మిస్తున్నారు. తాజాగా సంక్రాంతి(Sankranti) కానుకగా ఈ మూవీ నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ అదేంటంటే..
స్టైలిష్ లుక్‌లో ప్రభాస్..
పాన్ ఇండియా స్టార్(Pan India Star) ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ నుంచి మేకర్స్ ఇవాళ కొత్త పోస్టర్(New Poster) విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్(Stylish)గా కనిపిస్తున్నారు. అయితే ఈ తాజా పోస్టర్‌లో చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం’ అని ట్విటర్(X) వేదికగా పేర్కొంది.
Happy Sankranthi Darlings ❤️
Manam yeppudu vasthe appude Asalaina Panduga….Twaralo Chithakkottedham 🔥#TheRajaSaab will meet you soon in theatres. pic.twitter.com/pVAW0nyTjI
— The RajaSaab (@rajasaabmovie) January 14, 2025
విడుదల తేదీ వాయిదా?
ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ‘రాజా సాబ్’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ తేదీన సినిమా విడుదల కావడంలేదని Tటౌన్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదల తేదీ వాయిదా పడిందని, ఆ రోజున సినిమా రావడంలేదని తెలిపారు. కొత్త తేదీ ఖరారు(New Release Date) చేశారని, ప్రమోషన్(Promotinal Events) కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని పేర్కొన్నారు.







