రానా దగ్గుబాటి (Rana Daggubati).. ఈ యంగ్ హీరో వెండితెరపై తన నటనతోనే కాదు బుల్లితెర, ఓటీటీ, డిజిటల్ ప్లాట్ ఫామ్ లపై, అవార్డు ఈవెంట్స్ లలో తన హోస్టింగుతో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు టాక్ షోలు, ఈవెంట్స్ లకు హోస్టుగా వ్యవహరించాడు. ఇక తాజాగా మరో సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈసారి గ్లోబల్ రేంజులో ఈ టాక్ షో ప్లాన్ చేశాడు. అమెజాన్ ప్రైమ వీడియోస్ ఓటీటీలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది.
సెలబ్రిటీలతో రానా ఫన్ టాక్
‘ది రానా దగ్గుబాటి షో (The Rana Daggubati Show)’ పేరుతో వస్తున్న ఈ టాక్ షోకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), నేచురల్ స్టార్ నాని, నటి ప్రియాంక మోహన్, యంగ్ హీరో నాగచైతన్య, మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, కన్నడ స్టార్ రిషభ్ శెట్టి, యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela)తోపాటు రానా సతీమణి మిహికా బజాజ్ (Mihika Bajaj) కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. వీరంతా వేర్వేరు ఎపిసోడ్లలో కనిపించారు. ఈ షోలో వారంతా రానాతో ఎన్నో సరదా విషయాలు పంచుకున్నారు.
అలాంటి ఫ్యామిలీ కావాలి
ఈ ట్రైలర్ లో రానా తన సతీమణి మిహికాను పెళ్లి తర్వాత తాను బెటర్ గా మారానా అని ప్రశ్నించగా.. దానికి మిహికా.. ‘అవును, నాతో పెళ్లయింది అంటే తప్పకుండా బెటర్ అవ్వాల్సిందేనంటూ’ సరదాగా సమాధానం ఇచ్చారు. ఇక ఈ షోకు గెస్టుగా వచ్చిన అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)ను.. ‘‘నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు?’’ అని రానా ప్రశ్నించగా.. ‘‘సంతోషంగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు’’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. నవంబర్ 23వ తేదీ నుంచి ప్రైమ్ లో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది.






