
తిరుమల శ్రీవారి దర్శనం(Tirumala Srivari Darshan) కోసం భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా TTD చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కంపార్టుమెంట్ల వెలుపల కూడా భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి హుండీ కానుకలు రూ. 3.02 కోట్లు
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 74,374భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.37,477 మంది భక్తులు తలనీలాలను సమర్పించగా… హుండీ కానుకలు రూ. 3.02 కోట్లుగా ఉంది. తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నేడు ఉదయo 10 గంటలకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను విడుదల చేయనుంది. జులై నెల శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ టికెట్లు మే 29న ఉదయం 10 గంటలకు రిలీజ్ కానున్నాయి.