టాలీవుడ్(Tollywood)లో 100% సక్సెస్ రేటుని అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Director Anil Ravipudi).‘ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)’ హిట్‌తో మరోసారి తన సత్తాచాటాడు. కళ్యాణ్ రామ్ పటాస్(Patas)తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి(Bhagwant Kesari), తాజా ‘సంక్రాంతికి వస్తున్నాం’ దాకా ట్రాక్ రికార్డుని ఒకేలా మెయింటైన్ చేస్తున్నాడు. ఈ పండుగకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్‌తో మూడోసారి వెంకటేష్(Venkatesh)తో ఈ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ మరోసారి F2, F3కి మించిన ఫన్ అందించాడు. ఇదిలా ఉండగా రావిపూడి తన తర్వాత మూవీ సాహు గారపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు ఇది వరకే ప్రకటించాడు. తాజాగా అనిల్ రావిపూడి చిరుతో మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యం
ఈ నేపథ్యంలో చిరుని ఎలా చూపిస్తాడనే దాని పై ఫ్యాన్స్ ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రమోషన్ల(Promotions )లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వింటేజ్ చిరంజీవి(Vintage Chiranjeevi)ని చూపించడం కాదు.. కానీ ఆయనను తాను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని, ఫైనల్‌గా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా కథ రాసుకుంటానంటూ చెప్పేశాడు.

వింటేజ్ చిరంజీవిని చూస్తామా?
తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు(Gharana Mogudu), రౌడీ అల్లుడు(Rowdy Alludu) వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు(Mega Fans) తెగ ఖుషీ అయిపోతున్నారు. కాగా ప్రస్తుతం ‘విశ్వంభర(Vishwambhara)’ మూవీ చివరి దశలో ఉండడంతో పెండింగ్ షూటింగ్ పూర్తి చేయడంలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి-చిరు కాంబోలో కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
Vintage #Chiranjeevi Loading..?
“The script isn’t finalized yet, but if Chiranjeevi Garu agrees, I will write a lively character like the ones in Gharana Mogudu and Rowdy Alludu. It features comedy, dance, fights—everything! A complete entertainer.”
– #AnilRavipudi pic.twitter.com/XYFyg9d4t3
— Movies4u Official (@Movies4u_Officl) January 15, 2025







