IMD: ఈ సమ్మర్ చాలా.. హాట్ గురూ!

ఈ ఏడాది వేసవి(Summer) తెలంగాణ ప్రజలకు తీవ్రంగా ఇబ్బందికరంగా మారబోతోందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించింది. 1901 నుంచి 2025 వరకు నమోదైన ఉష్ణోగ్రతల సరాసరి(Average Temperatures)ని పరిశీలించింది. దీంతోనే ఈ ఏడాది ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. ముఖ్యంగా మార్చి రెండో భాగం, ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు(Temparature) రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. అలాగే గతంలో కంటే ఎక్కువగా వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది.

ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశం

ప్రస్తుతం గాలి తేమ శాతం క్రమంగా తగ్గుతుండటంతో వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోని దక్షిణ, మధ్య భాగాల్లో ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మే నెల నాటికి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు పెరిగే సూచనలు ఉన్నాయని IMD స్పష్టం చేసింది. ఇది 125 సంవత్సరాల కాలంలో అత్యధికంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో ఒకటిగా నిలవొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఏపీలోనూ ఈసారి ఎండలు మండిపోతయని పేర్కొన్నారు.

రాత్రి వేళల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు

ఇందులో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో సాధారణ స్థాయికి మించి వేడి తీవ్రత ఉంటుందని IMD వెల్లడించింది. గడచిన సంవత్సరాలతో పోల్చితే రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగే అవకాశముంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *