Telugu Cine Industry: సినీ కార్మికుల సమ్మెకు తెర.. నేటి నుంచి షూటింగ్స్ షురూ

గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Cine Industry)ను స్తంభింపజేసిన కార్మికుల సమ్మె(Cine Workers strike)కు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు(Producers) అంగీకరించడంతో ఈ సమ్మె ముగిసింది. తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చొరవతో జరిగిన చర్చలు ఫలించాయి. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి కార్మిక శాఖ కార్యాలయంలో గురువారం (ఆగస్టు 21) ఎనిమిది గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు విజయవంతమయ్యాయి. ఈ చర్చల్లో ఫిల్మ్ ఛాంబర్(Film chamber), నిర్మాతలు, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు(Employees Federation Representatives) పాల్గొన్నారు. కార్మికులు 30 శాతం వేతన పెంపు డిమాండ్ చేయగా, నిర్మాతలు మూడు దశల్లో 22.5 శాతం పెంపునకు అంగీకరించారు.

విధులకు హాజరవుతామని ప్రకటన

ఇక రోజువారీ వేతనం రూ.2000 కంటే తక్కువ ఉన్నవారికి మొదటి ఏడాది 12.5 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు. రూ.2000 నుంచి రూ.5000 మధ్య వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది. ఈ ఒప్పందాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు స్వాగతించారు. శుక్రవారం నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని, షూటింగ్‌(Shootings)లు యథావిధిగా ప్రారంభమవుతాయని ప్రకటించారు.

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన ఫెడరేషన్

ఈ నిర్ణయంతో టాలీవుడ్‌(Tollywood)లో సినిమా చిత్రీకరణలు మళ్లీ ఊపందుకోనున్నాయి. సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో కార్మికులు, నిర్మాతలు ఇరువర్గాలూ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *