
ప్రపంచంలోనే క్రికెట్ మక్కాగా గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక లార్డ్స్(Lords) వేదికగా ఈ రోజు నుంచి ఇంగ్లండ్, ఇండియా(India vs England) మధ్య మూడో టెస్ట్(Third Test Match) ప్రారంభం కానుంది. లండన్(London)లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి మ్యాచ్ ఆరంభమవుతుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లార్డ్స్‌లో వాతావరణ పరిస్థితులు, పిచ్ పూర్తిగా గ్రాస్‌తో నిండి ఉండటంతో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు(Pace Bowlers) వికెట్ల పండుగ చేసుకోవచ్చు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గగా.. రెండో టెస్టులో ఇండియా 336 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో సిరీస్‌లో ముందంజ వేయాలంటే మూడో టెస్టు కీలకం కానుంది.
IND vs ENG 3rd Test | Momentum the mantra 🏏
Series level at 1-1, the stakes sky-high at Lord’s — will India ride Edgbaston’s momentum or will England bounce back?
Reports✍️ @Sahil_Malhotra1 from London#INDvsENG #LordsTest #TeamIndia #EnglandCricket https://t.co/kXEU8Caj8j
— TOI Sports (@toisports) July 10, 2025
బుమ్రా ఎంట్రీ ఖాయం
కాగా శుభ్‌మన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలో భారత జట్టు గత మ్యాచు విజయంతో ఫుల్ జోష్‌లో ఉంది. లార్డ్స్ పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. గడ్డి కవర్‌తో కూడిన ఈ పిచ్ మొదటి రెండు సెషన్లలో బౌలర్లకు సహకరిస్తుందని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) అభిప్రాయపడ్డారు. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తిరిగి జట్టులో చేరడంతో భారత బౌలింగ్ దాడి మరింత బలపడింది. అకాశ్ దీప్(Akash deep) ఎడ్జ్‌బాస్టన్‌లో 10 వికెట్లతో రాణించినప్పటికీ, బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ లేదా నితీశ్ రెడ్డి బయట కూర్చోవచ్చు. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా బలంగా పుంజుకోవాలని చూస్తోంది.
నాలుగేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి ఆర్చర్
ఆ జట్టు స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) నాలుగు సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు, గస్ అట్కిన్సన్(Gus Atkinson) కూడా జట్టులో చేరాడు. బెన్ స్టోక్స్(Ben Stokes) నాయకత్వంలో ఇంగ్లండ్ బౌలర్లు భారత బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు. అటు భారత శుభ్‌మన్ గిల్ (585 పరుగులు) రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) రికార్డును బద్దలు కొట్టేందుకు సమీపంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో వాతావరణం కీలకం కానుంది. ఎందుకంటే 40-45% తేమ స్థాయిలు బౌలర్లకు సహాయకరంగా ఉండవచ్చు. ఈ టెస్ట్‌లో గిల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్‌లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ లార్డ్స్ ఆనర్స్ బోర్డ్‌పై స్థానం సంపాదించాలని ఆశిస్తోంది. ఇరు జట్లూ ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.