Mana Enadu : గత వారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప-2 ది రూల్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం దాదాపు అన్ని థియేటర్లలో ఈ చిత్రమే (Pushpa 2) సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరో వారంపాటు ఈ సినిమాయే రన్ అయ్యేలా ఉంది. మరోవైపు ఈ వారం థియేటర్లలో విడుదలయ్యేందుకు మరికొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వీక్ థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓసారి చూసేద్దామా..?
ఈ వారం థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
బచ్చల మల్లి : అల్లరి నరేశ్ (Allari Naresh), అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుబ్బు మంగదేవి తెరకెక్కించారు. డిసెంబరు 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.
యూఐ ది మూవీ : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఇది. ఈ ఫాంటసీ మూవీ పాన్ ఇండియా చిత్రంగా డిసెంబరు 20న విడుదల అవనుంది.
విడుదల పార్ట్ 2 : తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Setupathi), సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విడుదల. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న విడుదల పార్ట్ 2 ఈనెల 20న రిలీజ్ కానుంది.
సారంగపాణి జాతకం : ప్రియదర్శి (Priyadarshi) కథానాయకుడిగా రూప కొడువాయూర్ కథానాయికగా … మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 20న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!
నెట్‌ఫ్లిక్స్
ఇనిగ్మా (హాలీవుడ్) డిసెంబరు 17
లవ్ టూ హేట్ ఇట్ జూలియస్ (హాలీవుడ్) డిసెంబరు 17
స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) డిసెంబరు 18
ది డ్రాగన్ ప్రిన్స్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 18
వర్జిన్ రివర్ 6 (వెబ్‌సిరీస్) డిసెంబరు 19
ద సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (హాలీవుడ్) డిసెంబరు 20
యోయో హనీసింగ్ (ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ) డిసెంబరు 21
అమెజాన్ ప్రైమ్
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (హిందీ) డిసెంబరు 18
బీస్ట్ గేమ్స్ (హాలీవుడ్) డిసెంబరు 18
ఈటీవీ విన్
లీలా వినోదం (తెలుగు) డిసెంబరు 19
జియో సినిమా
ట్విస్టర్స్ (హాలీవుడ్) డిసెంబరు 18
మూన్‌వాక్ (హిందీ) డిసెంబరు 20
తెల్మా (హాలీవుడ్) డిసెంబరు 21






