ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే

Mana Enadu : గత వారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప-2 ది రూల్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం దాదాపు అన్ని థియేటర్లలో ఈ చిత్రమే (Pushpa 2) సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరో వారంపాటు ఈ సినిమాయే రన్ అయ్యేలా ఉంది. మరోవైపు ఈ వారం థియేటర్లలో విడుదలయ్యేందుకు మరికొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వీక్ థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఓసారి చూసేద్దామా..?

బచ్చల మల్లి : అల్లరి నరేశ్ (Allari Naresh), అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సుబ్బు మంగదేవి తెరకెక్కించారు. డిసెంబరు 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

యూఐ ది మూవీ : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఇది. ఈ ఫాంటసీ మూవీ పాన్ ఇండియా చిత్రంగా డిసెంబరు 20న విడుదల అవనుంది.

విడుదల పార్ట్ 2 : తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Setupathi), సూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విడుదల. వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న విడుదల పార్ట్ 2 ఈనెల 20న రిలీజ్ కానుంది.

సారంగపాణి జాతకం : ప్రియదర్శి (Priyadarshi) కథానాయకుడిగా రూప కొడువాయూర్‌ కథానాయికగా … మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 20న థియేటర్లలో సందడి చేయనుంది.

గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్ (హిందీ) డిసెంబరు 18

బీస్ట్‌ గేమ్స్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 18

లీలా వినోదం (తెలుగు) డిసెంబరు 19

ట్విస్టర్స్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 18

మూన్‌వాక్‌ (హిందీ) డిసెంబరు 20

తెల్మా (హాలీవుడ్‌) డిసెంబరు 21

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *