ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్‌ను (Threat Calls to Pawan Kalyan) చంపేస్తామని హెచ్చరించాడు. అభ్యంతరకంగా మెసేజ్‌లు కూడా వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్‌ను పవన్ కల్యాణ్ కార్యాలయం వెల్లడించినట్లు సమాచారం. బెదిరింపు కాల్స్, సందేశాలపై ఏపీ అధికారులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పోలీసులకు తెలియజేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశం
డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు పోలీసులను అలర్ట్ చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ అంశంపై హోంమంత్రి అనిత (home minister anitha) స్పందించారు. డీజీపీతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండుసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు హోంమంత్రి డీజీపీ తెలిపారు. దీంతో ఫోన్ కాల్ వచ్చిన నంబర్‌ను ట్రేస్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిత ఆదేశించారు. ప్రజాప్రతనిధుల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడేవారిని ఉపేక్షించకూడదని వెల్లడించారు.






