డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై (Ram gopal varma) తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు (AP High Court)సూచింది. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కావాలనే కేసులు పెడుతున్నారని ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన ఇప్పటకే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వారం రోజుల క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొన్న విషయం తెలిసిందే.
రేపు మళ్లీ విచారణ
దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా కోర్టులో విచారణ జరిగింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తుచేసింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మరోసారి స్పష్టం చేసింది. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించగా.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.
వర్మపై 9 జిల్లాల్లో కేసులు
ఏపీ ఎన్నికల సమయంలో, అంతకుముందు సోషల్ మీడియాలో (social media) ఆర్జీవీ (RGV) పెట్టిన పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. ఏపీలో మొత్తంగా 9 జిల్లాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.






