కొంతకాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(TG Cabinet Expansion)పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్తగా ముగ్గురికి క్యాబినెట్‌లో చోటు కల్పించింది. ఈ మేరకు వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), వాకిటి శ్రీహరి(Vakiti Srihari), అడ్లూరి లక్షణ్(Adluri Lakshman)లకు మంత్రులుగా ప్రమోషన్ దక్కింది. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించిడం విశేషం. ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్(Ramachandru nayak) నియమించారు. ఈ మేరకు వీరికి సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్(X)లో ట్వీట్ చేశారు. కాగా వీరు ఇవాళ మధ్యాహ్నం 12గంటల నుంచి 12.20 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నూతన మంత్రులుగా
బాధ్యతలు స్వీకరించబోతున్న
శ్రీ వివేక్ వెంకట స్వామి గారు,
శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు,
శ్రీ వాకిటి శ్రీహరి గారి కి
నా అభినందనలు.శాసన సభ లోఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ రామచంద్రు నాయక్ గారి కి
నా అభినందనలు.— Revanth Reddy (@revanth_anumula) June 8, 2025
వీరికి తప్పని నిరాశ
ఇదిలా ఉండగా పలువురు ఆశావహులకు కాంగ్రెస్ అధిష్ఠానం మొండిచేయి చూపింది. నిరాశ ఎదురైన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy), సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డితోపాటు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి(Vijayashanti)కి భంగపాటు తప్పలేదు. వీరిలో కొందరికి మరో విడతలో మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.






