
కమల్ హాసన్(Kamal Haasan).. విభిన్న పాత్రలకు ఆయన కేరాఫ్ అడ్రస్. సినీఇండస్ట్రీలో ఎలాంటి పాత్రకైనా వందశాతం న్యాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ‘భారతీయుడి’గా మెప్పించడమైనా.. ‘దశావతారుడి’గా అలరించడంలోనైనా ఆయన నటనకు ఎదురులేదు. వయసు పెరిగినా తనలో ఏమాత్రం పవర్ తగ్గలేదంటూ కమల్ వరుసబెట్టి మరీ సినిమాలు చేసేస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ హీరోగా చేస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్(Thug Life)’. స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు.
ఇది సెలబ్రేషన్స్‌కు సరైన సమయం కాదు..
థగ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్(Thug Life Audio Launch)ను ఘనంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు మే 16న భారీ ఈవెంట్ నిర్వహించాలని భావించారు. అయితే భారత్-పాకిస్థాన్(India-Pakistan Crisis) మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది సెలబ్రేషన్స్ టైమ్(Celebration time) కాదని, మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. తర్వలో మరో తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా ఓ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.
గ్యాంగ్‌స్టర్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో..
కాగా గ్యాంగ్ స్టర్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న థగ్ లైఫ్ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా, శింబు(Shimbu) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.