తిరుమల తిరుపతి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా అక్టోబర్(October) నెలకు సంబంధించి టికెట్ల విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(Srivari Arjitha Seva Tickets)ను ఈనెల 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్(Electronic Lucky Dip for e-service tickets) కోసం ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ-సేవా టికెట్లు పొందిన భక్తులు ఈనెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీడిప్ టికెట్ మంజూరు అవుతుంది.
![]()
సేవల టికెట్లు ఏ రోజు విడుదల చేస్తారంటే..
☛ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లు – జులై 22 ఉదయం 10 గంటలకు
☛ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లు – జులై 22 మధ్యాహ్నం 3 గంటలకు
☛ అంగప్రదక్షిణం టోకెన్లు(Angapradakshina tokens) – జులై 23 ఉదయం 10 గంటలకు
☛ శ్రీవాణి ట్రస్టు(Srivani Trust) ఆన్‌లైన్ కోటా టికెట్లు – జులై 23 ఉదయం 11 గంటలకు
☛ వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి ఉచిత ప్రత్యేక దర్శనం(Free special viewing) టోకెన్లు – జులై 23 మధ్యాహ్నం 3 గంటలకు
☛ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు – జులై 24 ఉదయం 10 గంటలకు
☛ తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ – జులై 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు
☛ TTD వెబ్‌సైట్‌లో https://ttdevasthanams.ap.gov.in మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని TTD విజ్ఞప్తి చేసింది.






