Kiara Advani: బాలీవుడ్ జోడీకి ప్రమోషన్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వాణీ

బాలీవుడ్ స్టార్ జంట కియారా అద్వాణీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra)కు తల్లిదండ్రులు(Parents)గా ప్రమోషన్ వచ్చింది. మంగళవారం (జులై 15) రాత్రి ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్‌(Reliance Hospital)లో కియారా ఆడబిడ్డ(Baby Girl)కు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా కపుల్ సోషల్ మీడియా(Social Media) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఒక చిన్న బేబీ సాక్స్ ఫోటో(Baby socks photo)ను పంచుకుంటూ “ఇట్స్ ఏ బేబీ గర్ల్.. మా జీవితంలో అతిగొప్ప బహుమతి వచ్చేసింది” అని క్యాప్షన్ ఇచ్చారు.

Kiara Advani Finally Married With Longtime Boyfriend Sidharth Malhotra In a  Grand Wedding Ceremony - YouTube

సెలబ్రిటీలు, అభిమానుల విషెస్

ఈ జంట 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వివాహం(Marriage) చేసుకుంది. కియారా ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో వీరికి సెలబ్రిటీలు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. కాగా, కియారా, సిద్ధార్థ్‌లు ‘షేర్‌షా’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వృత్తిపరంగా, కియారా ‘WAR 2’ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ NTRలతో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ‘పరమ్ సుందరి(Param SUndari)’ అనే రొమాంటిక్ కామెడీలో జాన్వీ కపూర్‌తో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *