ఆగస్టు 15, 1947న భారతదేశం(India) బ్రిటిష్ పాలన నుంచి విముక్తి(Liberation from British rule) పొంది స్వాతంత్ర్యం సాధించింది. ఈ స్వేచ్ఛ ఎంతో మంది త్యాగధనుల అవిశ్రాంత కృషి, బలిదానాల ఫలితం. నేటి స్వతంత్ర భారతం వారి సమర్పణకు అద్దం పడుతుంది. మహాత్మా గాంధీ(Mahatma Gandhi) అహింసా మార్గంతో దేశాన్ని ఏకం చేసి, ఉప్పు సత్యాగ్రహం, భారత్ ఛోడో ఉద్యమం వంటి కార్యక్రమాలతో బ్రిటిష్ వారిని సవాలు చేశారు. సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) ఆజాద్ హింద్ ఫౌజ్‌తో సాయుధ పోరాటానికి నాంది పలికారు. భగత్ సింగ్(Bhagat Singh), రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు.

నేటితో స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తి
రాణీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్(Chandrashekhar Azad) వంటి ఎంతోమంది వీరులు అసమాన ధైర్యంతో శత్రువును ఎదిరించారు. స్వాతంత్ర్య ఉద్యమం(Independence Movement)లో సామాన్య ప్రజలు, మహిళలు, విద్యార్థులు కూడా కీలక పాత్ర పోషించారు. జైలు శిక్షలు, హింస, ఆస్తుల జప్తును ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారి త్యాగాలు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యమంగా నిలిపాయి. నేటితో మనకు స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తి అయ్యి 79వ వసంతంలోకి స్వేచ్ఛగా అడుగుపెడుతున్నాం అంటే ఎంతో మంధి త్యాగధనుల కృషి ఫలితమే.
ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఆ త్యాగమూర్తుల స్ఫూర్తి(The spirit of sacrifice)ని స్మరించుకోవాలి. స్వతంత్ర భారతం వారి కలలను సాకారం చేసే దిశగా సాగాలి. సమత, సౌభ్రాతృత్వం, అభివృద్ధి వంటి ఆదర్శాలతో మన దేశం మరింత బలపడాలి. ఈ స్వాతంత్ర్య దినోత్సవంలో వారి బలిదానాలను గౌరవిద్దాం, దేశ సేవకు అంకితమవుదాం. జై హింద్!!






