కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్ (Squid Game)’ గురించి తెలియని వారుండరు. ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ లభించింది. ఇటీవలే దీని రెండో సీజన్ (స్క్విడ్ గేమ్ 2) నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది. ప్రస్తుతం పార్ట్-2 మరింత సంచలనం సృష్టిస్తోంది. మొదటి వారం అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగ్స్లో నెం.1 స్థానంలో ఉంది. ఇక మేకర్స్ మూడో సీజన్‌ను ‘స్వ్కిడ్గేమ్ 3’ రెడీ చేసే పనిలో పడ్డారు.
స్క్విడ్ గేమ్ విత్ ఇండియన్ స్టార్స్
స్క్విడ్ గేమ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే కొరియన్ నటులు కాకుండా మన ఇండియన్ హీరోలు ఈ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది. ఆ ఊహే అదిరిపోయింది కదూ. ఆ ఊహ నిజం కాకపోయినా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మన స్టార్లతో స్క్విడ్ గేమ్ ఆడించేయొచ్చు. ఓ నెటిజన్ అదే పని చేశాడు. మన స్టార్లతో స్క్విడ్ గేమ్ ఆడించాడు. ఏఐ సాయంతో స్క్విడ్ గేమ్ విత్ ఇండియన్ స్టార్స్ అనే ఓ వీడియోను (Squid Game AI Videos) రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
‘స్క్విడ్ గేమ్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
ఈ వీడియోలో స్టార్ హీరోలు చిరంజీవి, రజనీ కాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్ ‘స్క్విడ్ గేమ్’ డ్రెస్‌లో కనిపించారు. బాలీవుడ్, టాలీవుడ్ లోని స్టార్ హీరోలు, కమెడియన్లను ఈ వెబ్ సిరీస్‌లోని పాత్రల తరహాలో ఈ వీడియోలో చూసేయొచ్చు. ‘‘ఒకవేళ వీరంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘స్క్విడ్ గేమ్ (Indian Stars in Squid Game)’లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి’’ అనే క్యాప్షన్‌తో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరూ చూసేయండి.
This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8
— Priyanka Reddy – Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025







