టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ (AS Ravikumar) చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలో మృతిచెందారు. గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ సినిమాతో రవి కుమార్ దర్శకుడిగా పరిచయమ్యారు. ఆ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి దుర్గా తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’ నితిన్తో ‘ఆటాడిస్తా’ చిత్రాలను రూపొందించారు. ఆయన చివరి సినిమా రాజ్ తరుణ్తో తీసిన ‘తిరగబడరా సామి’. రవికుమార్ మృతికి తెలుగు దర్శకుల సంఘం సంతాపం ప్రకటించింది.
సినీ ప్రముఖులు సంతాపం
ఏఎస్ రవి కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఏఎస్ రవికుమార్ హఠాన్మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఫ్యామిలీలో గొడవల కారణంగా రవి కుమార్ గత కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగానే ఉంటున్నారు.






