ManaEnadu:టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ లో నటిస్తున్న సినిమా కన్నప్ప (Kannappa) , విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ప్రతి సోమవారం కీలక అప్డేట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని పలువురు పాత్రలను పరిచయం చేశారు. కన్నప్పగా మంచు విష్ణు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక తాజాగా కన్నప్ప మూవీ నుంచి మంచు విష్ణు ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్నారు.
ఈ మూవీలో తిన్నడికి విధేయుడైన స్నేహితుడు టిక్కిని పరిచయం చేశాడు మంచు విష్ణు. టిక్కి అనేది గుర్రం (Horse) పేరు. ఈ గుర్రానికి సంబంధించిన పోస్టర్ ను విష్ణు షేర్ చేశాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో విష్ణు లుక్ అదిరిపోయింది. ఇప్పటికే ప్రభాస్, అవ్ రామ్, శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేశ్ రిషి, అర్పిత్ రంగా, అక్షయ్ కుమార్ లకు సంబంధించిన పోస్టర్లను షేర్ చేసిన విషయం తెలిసిందే.
శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజునే కన్నప్ప నుంచి అప్డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
గతంలో ఈ సినిమా గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి నా గుండెల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా నేను ఉండలేను. జూన్ 14న టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది” అంటూ తన మనసులోని మాట పంచుకున్నారు. ఇక ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు మంచు అవ్రామ్ (Manchu Avram) ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.