కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) త్వరలోనే పాన్ ఇండియా సినిమా ‘యూఐ’ (UI The Movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. ఉపేంద్ర కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తునన ఈ చిత్రంలో రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ.. మీరు ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ లాంటి మైథలాజికల్ సినిమా చూశారు. ఇప్పుడు సైకలాజికల్ సినిమా చూడబోతున్నారన్నాడు. ఓపెనింగ్ నుంచే షాకవుతారు. ఈ ఇండస్ట్రీ ఇండియాకాదు ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. టాలీవుడ్ వెయ్యి, 2 వేల కోట్ల రూపాయల మార్క్‌కు వెళ్లున్నాయి. చిన్న టాలెంట్‌ను కూడా ఎంతో ఆదరిస్తారు. అదే నేనంటూ చెప్పుకొచ్చాడు.






