అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్! ఇండస్ట్రీలో హాట్ టాపిక్

అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్‌ త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్‌తో నవంబరు 26వ తేదీన వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ వైభవంగా జరిగింది. తాజా సమాచారం ప్రకారం అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని జూన్ 6న వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ వివాహ వేడుకను అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. గత ఏడాది అఖిల్ సోదరుడు అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాళ్లను అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనున్నట్లు సమాచారం.

నాగచైతన్య శోభిత ధూలిపాళ పెళ్లి అనంతరం అఖిల్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో అఖిల్ నిశ్చితార్థం విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా వెల్లడించారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. జైనబ్‌ తన ఇంటి కోడలిగా ఆహ్వానిచడం సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అఖిల్ వివాహ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది అక్కినేని అభిమానులకు మరొక ఆనందకరమైన ఘట్టం కానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *