
పెట్టుబడి(Investment Plans) పెట్టడం అంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం. మన దేశంలో చాలా రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. కానీ ఎందులో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక చాలామంది గందరగోళంలో పడిపోతారు. మన అవసరాలు, సేఫ్టీని బట్టి సరైన ఇన్వెస్ట్‌మెంట్ ఎంచుకోవాలి. భారతదేశంలో రిస్క్ తక్కువగా, మంచి రాబడి ఇచ్చే కొన్ని పెట్టుబడి మార్గాలు ఉన్నాయి అవి ఇంతే ఇప్పుడు మనం చూద్దాం.
1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs)
బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చాలా సేఫ్. మీరు పెట్టిన డబ్బు నిర్ణీత సమయానికి వడ్డీతో పాటు తిరిగి వస్తుంది. రిస్క్ ఉండదు.
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడికి (15 సంవత్సరాలు) ఉత్తమమైనది. మంచి వడ్డీతో పాటు టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది.
3. బంగారం (Gold)
బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. తగ్గే అవకాశం చాలా తక్కువ. కాబట్టి బంగారం కొనడం ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. భవిష్యత్తులో మంచి ధరకు అమ్ముకోవచ్చు.
4. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC)
ఇది కూడా ఒక స్థిరమైన రాబడిని ఇచ్చే మంచి పథకం. ఇది ఫిక్స్‌డ్ రాబడి ఇస్తుంది. గ్యారంటీగా వడ్డీ వస్తుంది కాబట్టి సేఫ్ ప్లాన్.
5. ఆర్బీఐ బాండ్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసే బాండ్లు చాలా సురక్షితం. వీటిలో పెట్టుబడి పెడితే రిస్క్ లేకుండా మంచి రాబడి వస్తుంది.
6. ప్రభుత్వ బాండ్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లు కూడా సురక్షితం. ఇవి కూడా రెగ్యులర్ వడ్డీ ఇస్తాయి.
7. సుకన్య సమృద్ధి యోజన
కుమార్తెల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తెచ్చిన స్కీమ్. ఇందులో డబ్బు పెట్టుబడి పెడితే, ఆ అమ్మాయి పెద్దయ్యే వరకు పెద్ద మొత్తంగా డబ్బు చేరుతుంది.
8. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
60 ఏళ్లు దాటిన వారికి ఇది స్పెషల్. వృద్ధాప్యంలో సేఫ్‌గా ఆదాయం వస్తూ ఉండటానికి ఇది చాలా ఉపయోగకరం.
9. రియల్ ఎస్టేట్
భూమి, ఇల్లు లేదా పొలం కొనడం కూడా మంచి ఇన్వెస్ట్‌మెంట్. సరైన ప్రదేశంలో కొంటే భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ ధర రెట్టింపు అవుతుంది.