టీమ్ ఇండియా(Team India) జెర్సీ స్పాన్సర్షిప్(Jersey sponsorship) కోసం జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కార్పొరేషన్(Toyota Motor Corporation) ఆసక్తి చూపిస్తోందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) డ్రీమ్11తో రూ.358 కోట్ల స్పాన్సర్షిప్ ఒప్పందం ముగిసిన తర్వాత కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతోంది. ఇటీవల భారత పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ (Online Gaming Promotion and Regulation Bill 2025)’ కారణంగా రియల్-మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడంతో డ్రీమ్11 ఒప్పందాన్ని ముగించింది. ఈ నేపథ్యంలో, Asia Cup 2025 సమీపిస్తున్న వేళ, BCCI కొత్త స్పాన్సర్‌ను త్వరగా కనుగొనాల్సిన ఒత్తిడిలో ఉంది. టయోటాతో పాటు, ఒక ఫిన్‌టెక్ స్టార్టప్ కూడా ఈ రేసులో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, అధికారిక టెండరింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
Dream11 pulls out as Team India’s sponsor after the Online Gaming Bill.
BCCI is now in talks with Toyota Motor Corporation and a fintech start-up for the Asia Cup 2025 in UAE. pic.twitter.com/Nc69jVh4ks
— Marketing Maverick (@MarketingMvrick) August 25, 2025
స్పాన్సర్ దొరకకపోతే ఎలా
కాగా బీసీసీఐ Dream-11తో ఉన్న మునుపటి ఒప్పందం కంటే ఎక్కువ విలువైన ఒప్పందాన్ని ఆశిస్తోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 9న UAEలో ప్రారంభమవుతుంది, ఇందులో భారత్-పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ వంటి హై-ప్రొఫైల్ గేమ్‌లు ఉంటాయి. ఇవి స్పాన్సర్లకు అపారమైన గుర్తింపును అందిస్తాయి. డ్రీమ్11 లోగోతో ఇప్పటికే తయారైన జెర్సీలు ఉపయోగించమవని, కొత్త స్పాన్సర్ కోసం తాజా జెర్సీలు తయారు చేయాల్సి ఉంటుందని సమాచారం. ఒకవేళ కొత్త స్పాన్సర్(New Sponsor)సమయానికి ఖరారు కాకపోతే, టీమ్ ఇండియా గత మూడు దశాబ్దాలలో లేని విధంగా స్పాన్సర్ లేకుండా ఆడవలసి రావచ్చు. టయోటా లాంటి గ్లోబల్ బ్రాండ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, భారత క్రికెట్ జట్టుకు కొత్త గుర్తింపు లభించనుంది.






