Mana Enadu : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjuna)ను ఐకాన్ స్టార్ గా.. టాలీవుడ్ హీరో బన్నీని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa Part-1) సినిమా. పార్ట్-1 ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సౌత్ లో మాత్రమే తెలిసిన ఈ ఐకాన్ స్టార్ పుష్ప రాజ్ మేనియాతో నార్త్ లో కూడా ఫేమస్ అయ్యాడు.
హాట్ కేకుల్లా పుష్ప-2 ప్రీ బుకింగ్స్
ఇక పుష్ప పార్ట్-1 క్లైమాక్స్ లోనే పార్ట్-2 ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ చెప్పేశాడు. గత కొంతకాలంగా ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప- 2 : ది రూల్(Pushpa 2 : The Rule)’ మరో మూడ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. రిలీజ్ కు ముందే పుష్ప రాజ్ ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెనయి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
హైదరాబాద్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
డిసెంబరు 5వ తేదీన పుష్ప-2 రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ లో స్పీడు పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రబృందం ముంబయి, కొచ్చిలో ప్రమోషన్స్ నిర్వహించింది. తాజాగా సోమవారం రోజున హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్(Pushpa 2 Pre Release Event)ను నిర్వహిస్తోంది. నగరంలోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఈ వేడుకకు అభిమానులు భారీ ఎత్తున రానుండడంతో భద్రత దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు (Hyderabad Traffic Restrictions) షురూ అయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. దాదాపు ఎనిమిది వేల మందికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పాస్‌లు జారీ చేశారు. 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం మూడు చోట్ల ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ డైవర్షన్స్
ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ మీదుగా పంజాగుట్ట వైపు మళ్లిస్తున్నారు (Traffic Diversions). మైత్రివనం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్ జంక్షన్ మీదుగా.. మైత్రివనం నుంచి బోరబండ వెళ్లే వాహనాలు కృష్ణకాంత్ పార్క్ మీద మోతి నగర్ వైపునకు పంపిస్తున్నారు.






