ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ మదన్ బాబు(Madan Babu) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్త సినీరంగంలో విషాదాన్ని నింపింది.
తమిళం లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ యాక్టర్ గా ఎదిగారు మదన్ బాబు. గత కొన్ని రోజులుగా ఆయన కాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. దీనికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన చెనై లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో August 2 (శనివారం)న కన్నుమూశారు.
మదన్ బాబు మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నటించిన ప్రధాన చిత్రాల్లో ‘ఆరు’, ‘జెమిని’ (విక్రమ్), ‘రన్’, ‘జోడీ’, ‘మిస్టర్ రోమియో’, ‘తెనాలి’, ‘ఫ్రెండ్స్’, ‘రెడ్’ వంటి సినిమాలు ఉన్నాయి.
తమిళ సినిమా ఇండస్ట్రీతో పాటు పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించిన మదన్ బాబు, తన వినోదభరితమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘నరసింహా’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.






