మలయాళ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా(Paradha)’ సినిమా ట్రైలర్ (Trailer) విడుదలైంది. ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kadregula)ఈ చిత్రాన్ని సోషియో డ్రామా జానర్‌లో రూపొందించారు. అనుపమతో పాటు దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.
పరదా వేసుకోవడం ఆచారంగా..
ట్రైలర్ ఒక గ్రామంలోని మహిళలు పరదా వేసుకోవడం ఆచారంగా చూపిస్తూ మొదలవుతుంది. అనుపమ పోషించిన సుబ్బు అనే పాత్ర ఈ కట్టుబాట్ల నుంచి తప్పించుకుని బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఈ ప్రయాణంలో ఆమెకు దర్శన, సంగీత(Sangeetha)లు ఎదురవుతారు. సుబ్బు అదృశ్యం కావడం, గ్రామంలో ఆమెకు పొంచి ఉన్న ప్రమాదం ట్రైలర్‌ను ఉత్కంఠగా మార్చాయి. మహిళా సాధికారత, సాంప్రదాయాలపై ప్రశ్నలు వేసే కథాంశం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో అనుపమ నటన, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మృదుల్ సుజిత్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి.
రామ్ పోతినేని ట్రైలర్ లాంచ్‌లో మాట్లాడుతూ, “ఈ కథ అద్భుతం, అనుపమ నటన ఫెంటాస్టిక్. ఇలాంటి సినిమాలు ప్రోత్సహించాలి” అన్నారు. అనుపమ కూడా ఈ చిత్రం తనకు ఎంతో ముఖ్యమని, రామ్ సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. బలమైన కథ, నటన, సాంకేతిక విలువలతో ‘పరదా’ ఒక శక్తివంతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది.






