అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పెట్రేగిపోతున్నారు. తమ ఆత్మీయ మిత్ర దేశం, ఆత్మీయ మిత్రుడు మోదీ(Modi) అంటూనే భారత్(India)పై ట్రంప్ ట్రేడ్ వార్(Trade War) ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సుంకాల(Tariffs) మీద సుంకాలు బాదేస్తున్నారు. భారత్ ఎగుమతుల(Exports)పై మరో 25 శాతం అదనంగా సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(Excutive Orders)పై సంతకం చేశారు. జులై 30న ప్రకటించిన 25 శాతం సుంకంతో కలిపితే తాజా పెంపుతో సుంకాలు 50 శాతానికి చేరాయి. దీంతో భారత్ నుంచి అమెరికా(US) దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.
“You’re going to see a lot more…You’re going to see so much secondary sanctions”: #Trump on being asked, why are you singling India out for these additional sanctions
For the latest news and updates, visit: https://t.co/by4FF5o0Ew pic.twitter.com/ohTam8g3HH
— NDTV Profit (@NDTVProfitIndia) August 7, 2025
రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకే..
కాగా రష్యా(Russia) నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. మొదటి 25 శాతం సుంకం ఆగస్టు 7 నుంచి, తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. భారత్ ప్రతీకార సుంకాలు విధిస్తే.. ఈ టారిఫ్‌లను మరింత పెంచి సవరించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని వైట్‌హౌస్(White House) హెచ్చరించింది. చైనా(Chaina)పై 51 శాతం, మలేసియాపై 25 శాతం, శ్రీలంకపై 30 శాతం, వియత్నాంపై 20 శాతం, జపాన్‌పై 15 శాతం చొప్పున యుఎస్ సుంకాలను విధించింది. పాకిస్థాన్‌పై విధించిన 19 శాతం సుంకాలతో పోల్చితే భారత్‌ను ట్రంప్ ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో స్పష్టమవుతోంది.
🧵 India’s Defiance: Why It’s Refusing to Bow to Trump’s Oil Tariffs
1/7
Trump slapped India with a 25% U.S. tariff, citing its continued purchase of Russian oil—and warned of hikes to 50% or more.
But India remains firm. pic.twitter.com/oy9PzL7H8z— Lumi Watch (@Lumibunnyy) August 7, 2025
ట్రంప్ సుంకాల ప్రకటనలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్
అయితే అమెరికా చర్యలు అన్యాయమైనవని భారత విదేశాంగ శాఖ(Ministry of External Affairs of India) పేర్కొంది. ఈ సుంకాలు అసమంజసమైనవని విమర్శించింది. దేశానికి అవసరమైన అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. ట్రంప్ చర్యలను ప్రతిపక్షాల నేతలు తీవ్రంగా ఖండించారు. ట్రంప్ సుంకాల ప్రకటనలపై ఇప్పటికైనా ప్రధాని మోదీ(PM Modi) మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ట్రంప్ టారిఫ్‌లపై ప్రధాని సమాధానం ఇవ్వాలని ఎక్స్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ చేశారు. ఈ సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.






