జనవరిలో అమెరికా అధ్యక్ష పదవి అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. కీలకమైన పదవుల్లో పలువురిని నామినేట్ చేస్తున్నారు. తాజాగా నాసా (NASA) అధిపతిగా జరెడ్ ఇసాక్‌మన్‌ను నామినేట్ చేసినట్లు బుధవారం ట్రంప్ ప్రకటించారు. ఇప్పటివరకు పనిచేస్తున్న బిల్ నెల్సన్ స్థానంలో అతడిని నామినేట్ చేశారు. జరెడ్ ఐసాక్‌మాన్ ఓ టెక్ బిలియనీర్. ఎలన్ మస్క్ కు అత్యంత సన్నిహితుడు. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌లో (SpaceX)పలుమార్లు అంతరిక్షంలోకి వెళ్లారు.
మిత్రదేశాలకు ఎంతో మద్దతునిచ్చారు..
‘జారెడ్ NASA ఆవిష్కరణలు, మిషన్‌ను నడిపిస్తారు. అంతరిక్షశాస్త్రం, సాంకేతికత, రీసెర్చ్‌లో సంచలనాత్మక విజయాలకు మార్గం సుగమం చేస్తారు. గత 25 సంవత్సరాలుగా, Shift4 వ్యవస్థాపకుడు, CEOగా జరెడ్ అసాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. ప్రపంచ ఆర్థిక సాంకేతిక సంస్థను నిర్మించారు. డిఫెన్స్ ఏరోస్పేస్ కంపెనీ అయిన డ్రెకెన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా దశాబ్దానికి పైగా పనిచేశారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, మా మిత్రదేశాలకు ఎంతో మద్దతునిచ్చారు’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ట్రంప్‌కు ఇసాక్‌మ్యాన్ కృతజ్ఞతలు
తనను నాసా చీఫ్‌గా నియమించడం పట్ల జరెడ్ ఇసాక్‌మ్యాన్ స్పందించారు. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. NASA తదుపరి అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయడానికి డొనాల్డ్ ట్రంప్ నన్న నామినేట్ చేయడాన్ని గౌవరంగా భావిస్తాను. మానవ చరిత్రలో అత్యంత అద్భుతమైన సాహసానికి నాయకత్వం వహించే నాసా పట్ల నాకు అపారమైన ఇష్టం ఉంది. నక్షత్రాల వైపు ప్రయాణించే సామర్థ్యాన్ని మరలా కోల్పోము. అమెరికన్లు చంద్రుడు, అంగారక గ్రహంపై నడుస్తారు. ఇలా చేయడం ద్వారా భూమిపై జీవితాన్ని మెరుగుపరుస్తాం అని వాగ్ధానం చేస్తున్నా. నన్ను నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
I am honored to receive President Trump’s @realDonaldTrump nomination to serve as the next Administrator of NASA. Having been fortunate to see our amazing planet from space, I am passionate about America leading the most incredible adventure in human history.
On my last mission…
— Jared Isaacman (@rookisaacman) December 4, 2024






