టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీతో కూడిన మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Ravi Teja). సరిగ్గా ఇలాంటి స్ర్కిప్ట్‌తోనే 2022లో ‘ధమాకా(Dhamaka)’తో వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు రవితేజకు భారీ డిజాస్టర్‌నే అందించాయి. బాక్సాఫీస్ వద్ద ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. దీంతో ఎలాగైనా మళ్లీ బ్లాక్‌బస్టర్ సాధించాలనే నిశ్చయంతో రవితేజ ‘మాస్ జాతర(Mass Jathara)’ అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమా, రవితేజ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ కీలక అప్డేడ్ విడుదల చేశారు.
![]()
మే 9న గ్రాండ్ రిలీజ్
డైరెక్టర్ భానూ భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల(Sreeleela) నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో
తాజాగా.. ‘తూ మేరా లవర్(Tu Mera Lover Lyric Video)’ అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ సంచలనం భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo) ‘తు మేరా లవర్’ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కరభట్ల(Bhaskarabhatla) సాహిత్యం మాస్ మెచ్చేలా ఉంది. రవితేజ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇడియట్(Idiot)’లోని ఐకానిక్ చార్ట్‌బస్టర్ “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే” పాటకు ట్రిబ్యూట్‌గా మలిచిన ‘తు మేరా లవర్’ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి(Chakri) స్వరాన్ని తిరిగి సృష్టించారు. రవితేజ శైలి ప్రత్యేక డ్యాన్స్ స్టెప్పులు, శ్రీలీల మాస్ డ్యాన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ సాంగ్‌ని చూసేయండి.






