అగ్రరాజ్య అధినేత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)పై రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలతో అమెరికన్లతోపాటు ప్రపంచ దేశాలకూ కనుకు లేకుండా చేస్తున్నారు. ఆయన నిర్ణయాలకు ఏకంగా ఆ దేంలోని రాష్ట్ర ప్రభుత్వాలు(Twelve states) కోర్టుకెక్కాయి. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
12 U.S. States Sue Trump Administration Over Tariffs
Following #California‘s initial lawsuit on April 16, 11 additional states filed suit against #Trump‘s administration in the Court of International Trade.
The states argue Trump unlawfully modified #tariffs without… pic.twitter.com/w3SqYF3VDZ
— Briefing Block (@briefing_block_) April 24, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై దేశంలోని 12 రాష్ట్రాలు(Twelve states) న్యాయస్థానాన్ని(trade court) ఆశ్రయించాయి. 1977 నాటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, అధ్యక్షుడికి లేని అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ టారిఫ్‌లు(tariff policy) విధించారని ఆ రాష్ట్రాలు తమ దావాలో పేర్కొన్నాయి. టారిఫ్‌లను విధించే అధికారం కేవలం చట్టసభ (కాంగ్రెస్)కు మాత్రమే ఉందని, అత్యవసర పరిస్థితుల్లో టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (International Emergency Economic Powers Act – IEEPA) కల్పించదని పిటిషన్‌లో హైలైట్ చేశాయి.
12 U.S. states jointly sue Trump administration over tariff policy pic.twitter.com/1tqx5vSpeu
— carel (@Uncarel) April 24, 2025
గందరగోళంలో US ఆర్థిక వ్యవస్థ
ట్రంప్ ఏకపక్షంగా టారిఫ్‌లు విధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేసిందని ఆరోపించాయి. అరిజోనా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మైనే, మిన్నెసోటా, నెవాడా, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఒరెగాన్, మరియు వెర్మోంట్ రాష్ట్రాలు ఈ దావాను దాఖలు చేశాయి. ఈ రాష్ట్రాలు ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల తమ ఆర్థిక వ్యవస్థలు, వ్యాపారాలు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారని వాదిస్తున్నాయి. ట్రంప్ తన ఇష్టానుసారంగా టారిఫ్‌లు విధించడం ద్వారా దేశ వాణిజ్య విధానాన్ని అనిశ్చితిలోకి వెళ్లిందని పేర్కొన్నాయి.








