నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamur Balakrishna), దర్శకుడు బాబీ(Director Bobby) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్(Daaku Maharaj)’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath), ఊర్వశి రౌటేలా కథానాయికలు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 12) ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజైంది. ఓవర్సీస్‌లో ఆల్రెడీ బొమ్మ పడిపోయింది. ఈ సినిమా గురించి నెటిజన్లు ట్విటర్, ఇతర సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు..
పవర్ ప్యాక్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారు..
డాకు మహారాజ్(Daaku Maharaj) ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లే కాస్త ల్యాగ్ అనిపిస్తోందంట. అయితే ఈ మూవీలో బాలయ్య(Balayya) కోసం రాసుకున్న సీన్లు, బాబీ ఇచ్చిన ఎలివేషన్లు అదిరిపోయాయని చెబుతున్నారు. ఇక తమన్ మళ్లీ తన డ్యూటీని వందకు రెండొందల శాతం చేశాడట. BGM అదిరిపోయిందని చెబుతున్నారు. టెక్నికల్‌గా ఈ మూవీ చాలా బ్రిల్లియంట్‌గా ఉందట.
#DaakuMaharaaj Good 1st Half!
So far a pretty well executed mass entertainer with regular doses of good mass elevations. Pace dips here and there with a family element but does not bore. Balayya and Thaman combo on duty again backed by good technical values. 2nd Half awaits!
— Venky Reviews (@venkyreviews) January 11, 2025
ఇక డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్టైనర్(Paisa Vasool Entertainer). ఈ చిత్రంలో బాలకృష్ణ, బాబీ డియోల్(Bobby Deol) పవర్ ప్యాక్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారు. ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) సెక్సీ ఐటెమ్ సాంగ్ అదిరిపోతుంది. ఈ చిత్రంలోని డైలాగ్స్‌కు సీటీ కొట్టాల్సిందే. సీటీమార్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఈ సినిమా రొటీన్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే అయినప్పటికీ.. సంక్రాంతి(Sankranthi) పండుగకు పక్కాగా సరిపోయే చిత్రం అని ఉమేర్ సంధూ తన రివ్యూ ఇచ్చాడు. కాసేపట్లో ‘‘మనఈనాడు’’ పూర్తి రివ్యూ..
First Review #DaakuMaharaaj from Censor Board : It is designed to magnetize the masses in hordes. The accurate blend of action, emotions, drama and humor, besides a Paisa Vasool performances by #NandamuriBalakrishna & #BobbyDeol makes this picture watchable. Go for it !
⭐️⭐️⭐️ pic.twitter.com/uTWwu9Pxp4
— Umair Sandhu (@UmairSandu) January 8, 2025







